మిర్యాలగూడ : కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

నాడు రాష్ట్రం కోసం... నేడు రాష్ట్ర హక్కుల కోసం , కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా నల్లగొండలో నిర్వహించే కెసిఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కోరారు

మిర్యాలగూడ : కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

మిర్యాలగూడ, మన సాక్షి :

నాడు రాష్ట్రం కోసం… నేడు రాష్ట్ర హక్కుల కోసం , కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా నల్లగొండలో నిర్వహించే కెసిఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కోరారు. గురువారం మిర్యాలగూడలోని వైదేహి టౌన్షిప్ లోని పార్టీ కార్యాలయంలో గుండ సభను విజయవంతం చేయడానికి మిర్యాలగూడ మండల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభ ఫిబ్రవరి 13 నిర్వహించనున్నదన్నారు.
కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ, కృష్ణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పగించడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి, తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు బీఆర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభకు హాజరవుతారన్నారు

ALSO READ : రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాల వారికేనా. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దండగేనా..!

నల్లగొండ జిల్లా కేంద్రం నందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సభకు నియోజకవర్గం వ్యాప్తంగా 15 వేల మందికి పైగా తరలి వెళ్ళాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో నల్లగొండ పోస్టర్ ను ఆవిష్కరించారు.
సమావేశానికి అతిదులుగా బహిరంగసభకు మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవరిస్తున్న పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి,

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు తిప్పన విజయసింహ రెడ్డి , జిల్లా మాజీ రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపిపి అమరావతి సైదులు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిట్టి బాబు నాయక్, పాక్స్ ఛైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, మండల రైతు బంధు సమితి మాజీ అద్యక్షులు గడగొజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మాజీ ఎంపిపి ఒగ్గు జానయ్య, భోగవేల్లి వెంకటరమణ చౌదరి, చౌగాని బిక్షం గౌడ్, తదితరులు హాజరయ్యారు.

ALSO READ : Gruhajyothi : గృహజ్యోతి.. 200 యూనిట్ల ఉచిత విద్యుతుకు బ్రేక్..!