నల్లగొండ : కోమటిరెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరికలు

నల్లగొండ పట్టణ బి.ఆర్.ఎస్ మహిళ అధ్యక్షురాలు, మన్సిపల్ మాజీ ప్లోర్ లీడర్ దుబ్బా రూప అశోక్ సుందర్ మంగళవారం హైదరబాద్ లోని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.

నల్లగొండ : కోమటిరెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరికలు

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ పట్టణ బి.ఆర్.ఎస్ మహిళ అధ్యక్షురాలు, మన్సిపల్ మాజీ ప్లోర్ లీడర్ దుబ్బా రూప అశోక్ సుందర్ మంగళవారం హైదరబాద్ లోని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. వారికి ఎంపీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ… పార్టీ శ్రేణులంతా నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.ఈ కార్యకరంలో మన్సిపాల్ వైస్ ఛైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్,మాజీ ఎంపీటీసీ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ALSO READ ; Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!