అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: కోమటిరెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: కోమటిరెడ్డి

కనగల్, మన సాక్షి:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం లచ్చు గూడెం, తిమ్మాజిగూడెం, హైదలాపురం, తుర్కపల్లి, ఏం గౌరారం, అమ్మగూడెం, కుమ్మరిగూడెం, బొమ్మేపల్లి, కనగల్, కనగల్ ఎక్స్ రోడ్డు, పర్వతగిరి, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని, అర్హులైన పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అందరినీ మోసం చేసిన కెసిఆర్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ALSO READ : BIG BREAKING : గొడ్డళ్లు, కత్తులతో సూర్యాపేట బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి

నేను మీ సేవకుడిని నన్ను గెలిపిస్తే మీ సేవ చేసుకుంటాను అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి తనకు తోచిన విధంగా సాయం చేశా అనే తప్ప ఎవరిని నొప్పించలేదన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేరళ రాష్ట్రం ఎంపీ సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మందడి రామచంద్రారెడ్డి,

మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పాశం సంపత్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు కూసుకుంట్ల రాజు రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరావు,

చిలుక రాజు వెంకన్న, రఘు, గోలి నర్సిరెడ్డి, పోశమల్ల లింగయ్య, జగాల్ రెడ్డి, నీలకంఠం శేఖర్, పగిడిపాటి సత్తయ్య, మాచర్ల శ్రీను, నీలకంఠం సైదులు, నీలకంఠం వంశీ, సాయి, మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : సిపిఎం, టిఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు..!