హనుమకొండ  : కొండచిలువ కలకలం

హనుమకొండ  : కొండచిలువ కలకలం

శాయంపేట , మన సాక్షి

హనుమకొండ జిల్లాశాయంపేట మండలంపెద్దకోడెపాక గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చే మంచి నీటి చెలిమేబావి నందు అతిపొడవైన కొండచిలువ ఉండడం ఉదయాన్నే మంచినీటి కోసమై వచ్చే గ్రామవాసులను ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేసింది.

సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి అటవీ అధికారులకు సమాచారం అందించిన వెంటనేఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్, ఫారెస్టు సిబ్బంది సారధ్యంలో మంచినీటి చెలిమే బావి నుండి కొండ చిలువను బయటకు తీసి అడవిప్రాంతంలో వదిలివేయనున్నట్లు సర్పంచ్ తెలపడం జరిగింది.

ఈ విషయం పై సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మంచినీటి చెలిమే బావినిశుభ్రం చేసి రేపటిలోగా మంచినీటికోసం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.