బైరవునిపల్లి లో జాలర్ల కు చిక్కిన కొండచిలువ..!

మండలం లోని బైరవునిపల్లి లో చేపల వేట కు వెళ్లిన జాలర్లకు కొండ చిలువ చిక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని బైరవునిపల్లి కి చెందిన జాలర్లు ఆదివారం కెనాల్ లో చేపల వేట కు వెళ్లారు.

నేలకొండపల్లి,  మన సాక్షి:

మండలం లోని బైరవునిపల్లి లో చేపల వేట కు వెళ్లిన జాలర్లకు కొండ చిలువ చిక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని బైరవునిపల్లి కి చెందిన జాలర్లు ఆదివారం కెనాల్ లో చేపల వేట కు వెళ్లారు.

జాలర్లు వలను విసరగా…. పెద్ద కొండ చిలువ చిక్కింది. దాదాపు 7 అడుగుల పొడవు. 35 కేజీల బరువు ఉంది. వలలో పడటంతో వల తెగింది. వెంటనే జాలర్లు కొండ చిలువ ను ఒడ్డుకు తీసుకొచ్చి వదిలేశారు.

ALSO READ : పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!