రేపటి నుంచి కృష్ణ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్..!

నారాయణపేట జిల్లాలోనీ కృష్ణ బ్రిడ్జి నుండి కర్ణాటక రాయచూర్ వైపు వెళ్లే వాహనాలను రేపటి నుంచి 17 ఉదయం 5:00 గంటల నుండి 45 రోజుల వరకు బంద్ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి కృష్ణ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్..!

.ఎస్పీ యోగేష్ గౌతమ్.

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

నారాయణపేట జిల్లాలోనీ కృష్ణ బ్రిడ్జి నుండి కర్ణాటక రాయచూర్ వైపు వెళ్లే వాహనాలను రేపటి నుంచి 17 ఉదయం 5:00 గంటల నుండి 45 రోజుల వరకు బంద్ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కృష్ణ (బ్రిడ్జ్) వంతెన పై కర్ణాటక ప్రభుత్వం రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్న సందర్భంగా ఎన్.హెచ్-167 రహదారిని బంద్ చేయడం జరుగుతుందని కృష్ణా, మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారుల కు అవగాహన నిమిత్తం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 500లతో నిమిషాల్లోనే..!

రాయిచూర్ కి వెళ్ళే వారు మరికల్ సబ్ స్టేషన్ నుండి చిత్తనూరు, అమరచింత జూరాల డ్యాం, గద్వాల్ మీదుగా కేటీ దొడ్డి రాయచూర్ కు డైవర్షన్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. వాహనదారులు గమనించగలరు, పోలీస్ వారికి ప్రజలు, వాహనదారులు సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

ALSO READ : Good News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగా..!