భూ కబ్జాకు పాల్పడుతున్న బడా కంపెనీ

భూ కబ్జాకు పాల్పడుతున్న బడా కంపెనీ

బీహార్ కూలీలతో బాధితుడికి బెదిరింపులు

రంగారెడ్డి జిల్లా, మాడ్గుల ప్రతినిధి, మన సాక్షి:
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి శివారులోని తన పట్ట భూమి సర్వే నెంబర్ 87, 88లలో ఉన్న మూడు ఎకరాల భూమిని ఆగ్రో విట్ సీడ్స్ కంపెనీ యజమాని కబ్జా చేసేందుకు గత కొన్ని ఏళ్లుగా యత్నిస్తున్నాడని బాధితుడు రాఘవాచారి వాపోయాడు.

ALSO READ : NREGS : ఉపాధి హామీ సిబ్బందిపై కొరడా.. రూ.1.5 లక్షలు రికవరీ..!

బాధితుడు వింజమూరి రాఘవాచారి  బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అప్పారెడ్డిపల్లి శివారులోని సర్వే నెంబర్ 87, 88లలో 4.23 ఎకరాల పట్టా భూమిని నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన పడకంటి మల్లేష్ గౌడ్ నుంచి 2019లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని పేర్కొన్నారు.

తాను కొనుగోలు చేసిన ఇట్టి భూమి చుట్టూ రాతి కడీలు నాటించి చుట్టూ ఫెన్సింగ్ చేయించగా సమీపంలో ఉన్న సీడ్స్ కంపెనీ వారు 2020లో భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించి కబ్జా చేసేందుకు యత్నించాడని తెలిపాడు. మరోసారి 2021లో కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని కాగా  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని బాధితుడు వాపోయాడు.

ALSO READ : MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!

ఆ తర్వాత మళ్లీ ఇటీవల కంపెనీ యజమాని తన కంపెనీలో పని చేసే బీహార్ కూలీలతో కలిసి కబ్జాకు యత్నించగా మాడ్గుల పోలీసులను సంప్రదించగా సిఐ రాజశేఖర్ అక్టోబర్ 4వ తేదీన సంఘటన స్థలాన్ని చేరుకొని భూమిని పరిశీలించి వెళ్లినట్లు తెలిపాడు.

అయినప్పటికీ బుధవారం కంపెనీలో పనిచేస్తున్న కూలీలు కబ్జా యత్నించడంతో పోలీస్ స్టేషను లో ఫిర్యాదు చేసి తనకు జరుగుతున్న అన్యాయం గురించి విలేకరుల ముందు మొరపెట్టుకున్నారు. తన పట్టా భూమి కబ్జా చేసేందుకు యత్నిస్తుంటే అతనిపై చర్యలు తీసుకోకుండా తనపై కేసు పెడతామంటూ పోలీసులు చెబుతున్నారని రాఘవాచారి ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!