Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

NREGS : ఉపాధి హామీ సిబ్బందిపై కొరడా.. రూ.1.5 లక్షలు రికవరీ..!

NREGS : ఉపాధి హామీ సిబ్బందిపై కొరడా.. రూ.1.5 లక్షలు రికవరీ..!

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

– డి ఆర్ డి ఓ కిరణ్ కుమార్

అనంతగిరి , మన సాక్షి :

విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన ఉపాధి సిబ్బందిపై ఉన్నతాధికారులు కొరడా జోలిపించారు.  సిబ్బంది నుంచి 1. 54 లక్షల రూపాయలను రికవరీ చేశారు వివరాల ప్రకారం…

ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని డిఆర్డిఓ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం అనంతగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలో పాల్గొని ఆయన మాట్లాడారు.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

2వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ 2021 జనవరి 1వ తేదీ నుండి 2023 మార్చ్ 31వ మధ్య 19 గ్రామపంచాయతీలకు సంబంధించిన పనులు సుమారు 10.45 కోట్ల రూపాయల ఖర్చులు అయ్యాయన్నారు.

మండల పరిధిలోని అన్ని గ్రామాలలో సామాజిక తనిఖీ గత నెల 17వ తేదీ నుండి ఈ నెల 02వ తేదీ వరకు జరిగిందని వారు అన్నారు.గ్రామానికి సంబంధించిన సిబ్బందిని,కార్యదర్శిని వారు చేసిన పొరపాట్లను గురించి తెలిపారు.

ALSO READ : MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!

కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడం వలన వారికి పెనాల్టీ 10,000, రికవరీ 1,54,260 రూపాయలు వేశామన్నారు.

మస్టర్లలో సంతకాలు లేక నిర్లక్ష్యం వ్యవహరించిన సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ,అంబుడ్స్ మెన్ లచ్చీరాంనాయక్, డిబిటి మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఏవివో ఆశకుమారి, సర్పంచులు, ఎంపీటీసీలు, సామాజిక తనిఖీ సిబ్బంది, ఏపీవోలు శ్రీనివాసరావు, శైలజ, కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!

Chalamaiah, Ananthagiri

మరిన్ని వార్తలు