Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

24న ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటన..!

24న ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటన..!

కలెక్టర్ హరి చందన దాసరి.

నల్లగొండ , మనసాక్షి,

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఈనెల 24వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. బుధవారం ఆమె తన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన తర్వాత జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 24వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

అనంతరము ఏప్రిల్ 4వ తేదీన పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. పట్టబద్రుల ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో కూడిన జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమావేశoలో అందజేశారు. పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుపగా అట్టి పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈసీఐకి పంపనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ALSO READ : నేడు మేడారం మహా జాతర తొలిఘట్టం.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం..!

ఇప్పటి వరకు వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4 లక్షల 27 వేల 302 మంది ఓటర్లుగా నమోదు అయినట్లు ఆమె తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జే.శ్రీనివాస్, గుమ్మల మోహన్ రెడ్డి (కాంగ్రెస్), పోతేపాక లింగస్వామి (బిజెపి), బక్క పిచ్చయ్య (టిఆర్ఎస్), బి.మల్లికార్జున్ (టిడిపి), యారా శ్రీను ఏ ఏ పి..చాంద్ పాషా బీఎస్పీ, మహమ్మద్ అబ్దుల్ మాలిక్ ఏఐఎంఐఎంఖుతుబుద్దిన్ ఏ ఏ పి సూపరింటిండెంట్ కృష్ణమూర్తి, ఎలక్షన్ డిటి విజయ్, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఆలగడప, దొండవారి గూడెంలో దాడులు..!

మరిన్ని వార్తలు