మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఆలగడప, దొండవారి గూడెంలో దాడులు..!

పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా దారులపై మిర్యాలగూడ పోలీసులు పాదం మోపారు. అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యంను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.

మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఆలగడప, దొండవారి గూడెంలో దాడులు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా దారులపై మిర్యాలగూడ పోలీసులు పాదం మోపారు. అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యంను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఇటీవల దామరచర్ల మండలంలోని వాడపల్లి చెక్ పోస్టు వద్ద పిడిఎస్ బియ్యంను పట్టుకున్న పోలీసులు మిర్యాలగూడ మండలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ALSO READ : కదులుతున్న బస్సు ఎక్కిన మహిళ.. డ్రైవర్ ఆమె పాలిట దేవుడయ్యాడు.. (వీడియో)

మండలంలోని ఆలగడపలో మంగళవారం 13 క్వింటాళ్ల బియ్యం పట్టుకొని సీజ్ చేసినట్లు సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్ తెలిపారు. మండలంలోని ఆలగడప గ్రామంలో బిక్షం నివాసంలో కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేసి బియ్యంను స్థానిక డీలర్ కు అప్పగించారు .

అదేవిధంగా మండలంలోని దొండవారిగూడెంలో కటికర్ల వెంకయ్య ఇంట్లో పిడిఎస్ బియ్యం ఇంట్లో నిల్వ ఉండగా రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది,

ALSO READ : BIG BREAKING : నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల..!