BIG BREAKING : నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ తెలియజేసింది. గ్రూప్ -1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది

BIG BREAKING : నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ తెలియజేసింది. గ్రూప్ -1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ పోస్టులకు ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. మార్చి 14వ తేదీన చివరి తేదీగా నిర్ణయించారు.

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (https://www.tspsc.gov.in) సందర్శించి గ్రూప్ వన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20 22 లో 503 గ్రూప్ -1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ పోస్టులకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు.

ALSO READ : Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 26న నల్గొండలో భారీ జాబ్ మేళా..!

కానీ ఒకసారి పేపర్ లీక్ కావడం కారణంగా, మరోసారి పరీక్ష నిర్వహణ లోపం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. రెండోసారి నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెల్లడించేలా అనుమతివ్వాలని సుప్రీంకోర్టును గత ప్రభుత్వం కోరింది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విత్‌డ్రా చేసుకోవడంతో సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇది ఇలా ఉండగా గ్రూప్ -1 నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వయోపరిమితిని పెంచుతూ తీసుకుంది. వరుసగా రెండు పర్యాయాలు ఈ పరీక్ష రద్దు కావడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితిని 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్లకు పెంచింది. దీంతో 46 ఏళ్ల వరకు అభ్యర్థులు గ్రూప్ -1 పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.

ALSO READ : మిర్యాలగూడ : ఎండుతున్న పంటలు..!