మిర్యాలగూడ : ఎండుతున్న పంటలు..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయి. గత వారం రోజులుగా ఎండలు పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతుల ఎక్కువగా బోరుబావుల కింద సాగు చేశారు.

మిర్యాలగూడ : ఎండుతున్న పంటలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయి. గత వారం రోజులుగా ఎండలు పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతుల ఎక్కువగా బోరుబావుల కింద సాగు చేశారు.

ఇటీవల ఎండలు పెరగడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని యాదగిరి పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో బోరు బావుల కింద ఎండిపోయిన పొలాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి బోర్ల లో బావులలో డిసెంబర్, జనవరిలో సాగునీరు ఆశాజనకంగా ఉండటంలో రైతులు వరి నాట్లు పెట్టినారని, భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో తగ్గటం వలన బావులలో నీరు చుక్క లేక బోర్లలో అడుగంటకపోయి బోరు పోసే పరిస్థితి లేదన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని, వరి పొలం పొట్ట దశలో ఎఅండి పోయినదని, రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైందన్నారు.

ALSO READ : అదిరిపోయేలా వారి పెళ్లి.. (వీడియో)

రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచినచేసి 10 రోజులపాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తడకమళ్ళ లాకు లాకుల వరకు అన్ని కాలువలకు నీరు వదిలి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ప్రజా ప్రతినిధుల మీదఉందని వారన్నారు. సాగునీరు వదలని పక్షంలో ప్రభుత్వ అధికారులు అన్ని గ్రామాలు తిరిగి నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలన చేసి రైతులు పెట్టిన పెట్టుబడి ఇవ్వాలని వారన్నారు. కొన్ని ప్రాంతాలలో కౌలు రైతులు కౌలు చేసి పూర్తిస్థాయిలో పెట్టుబడి పెట్టి ఇవ్వాళ ఎండిపోయే పరిస్థితి ఉన్నదన్నారు.

ఆ రైతులకు ఏం చేయాలో తెలియడం లేదని, ప్రభుత్వ అధికారులు కౌలు రైతులను గుర్తించి వారికి కూడా నష్ట పరిహార ఇవ్వాలని వారన్నారు. లేనిపక్షంలో రైతులను సమీకరణ చేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన రైతులు, సంఘం నాయకులు గువ్వల వెంకటయ్య , అప్పన బోయిన పురుషోత్తం, ఆకిటి రామస్వామి, గువ్వల అంజయ్య , గువ్వల మట్టయ్య ,దుండిగాల వెంకటయ్య ,డి వెంకన్న ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : ఉచిత విద్యుత్ కోసం ఆధార్ కు ప్రత్యామ్నాయం ఉంది.. రేషన్ కార్డుకు లేకుంటే ఎలా..!