Telangana : ఉచిత విద్యుత్ కోసం ఆధార్ కు ప్రత్యామ్నాయం ఉంది.. రేషన్ కార్డుకు లేకుంటే ఎలా..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను వంద రోజులలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Telangana : ఉచిత విద్యుత్ కోసం ఆధార్ కు ప్రత్యామ్నాయం ఉంది.. రేషన్ కార్డుకు లేకుంటే ఎలా..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను వంద రోజులలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీ హామీలను ఈనెలాఖరులోగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పేరుతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. అందుకుగాను వినియోగదారుల నివాసానికి వెళ్తున్న విద్యుత్ అధికారులు ఆధార్ కార్డు తో పాటు రేషన్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు.

ALSO READ : Google : గూగుల్ యూజర్లకు వార్నింగ్.. ప్లీజ్ ఇలా చేయొద్దు..!

కాగా ఆధార్ కార్డు లేని వారికి ప్రభుత్వం ఇటీవలనే ఒక శుభవార్త తెలియజేసింది. ఆధార్ కార్డు లేని వారు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నెంబర్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, కిసాన్ పాసుబుక్ ఇలా.. ఏవైనా ప్రత్యామ్నాయంగా ఇవ్వచ్చునని సూచించింది. దాంతో ఆధార్ కార్డు లేని వారికి ఊరట కలిగింది.

రేషన్ కార్డు తప్పనిసరి :

200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలని నిబంధనలు పెట్టింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు లేని కుటుంబాలు సుమారుగా 30 లక్షలు ఉన్నట్లు సమాచారం. కాగా రేషన్ కార్డు లేకుంటే ఉచిత విద్యుత్తుకు ఎలా..? అని వినియోగదారుల్లో ఆందోళన కలుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దాంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.

ALSO READ : BREAKING : సూర్యాపేట గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాలకు దరఖాస్తులు చేసుకోవడానికి రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. దాంతో రేషన్ కార్డు లేని పేదలు ఆందోళన చెందుతున్నారు. మరి ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుతుకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఆధార్ కార్డు కు ప్రత్యమ్నాయం చూపినట్లుగానే రేషన్ కార్డు లేకున్నా.. మరో ప్రత్యామ్నాయంగా చూపించి దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని పేదలు కోరుతున్నారు.

అంతేకాకుండా ఇటీవల ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నెంబర్ ఇస్తే సరిపోయేలా చూడాలని అనేకమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉచిత విద్యుత్ కు ప్రస్తుతం రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనలను మార్చుతారా..? అవే కొనసాగిస్తారా? అనే విషయం పై ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ALSO READ : మిర్యాలగూడ : కాలు విరిగిందని ఆసుపత్రికి వెళ్తే.. తొమ్మిది ఏళ్ల బాలిక మృతి..!