Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీతెలంగాణ

Google : గూగుల్ యూజర్లకు వార్నింగ్.. ప్లీజ్ ఇలా చేయొద్దు..!

Google : గూగుల్ యూజర్లకు వార్నింగ్.. ప్లీజ్ ఇలా చేయొద్దు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

గూగుల్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఏ విధంగా ఉపయోగించాలో చెప్తోంది. చాట్ జిపిటికీ పోటీగా రూపొందించిన బార్డ్ ఏఐ చాట్ బాట్ కు గూగుల్ కొత్త పేరు పెట్టింది. దీనికి జెమినీ గా పేరు మార్చి అడ్వాన్సుడ్ ఫ్యూచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని వినియోగం గురించి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఎలా వినియోగించాలో తెలియజేసింది. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అడుగుపెడుతుంది. చాలా కంపెనీలు ఏఐ బేస్డ్ సర్వీస్ లను ప్రారంభించి ప్రయత్నిస్తున్నాయి. అదే క్రమంలో చాట్ జిపిటికి పోటీగా రూపొందించిన చాట్ బాట్ కు గూగుల్ జెమిని ఏఐగా పేరు మార్చి అడ్వాన్సుడ్ ఫీచర్లతో ముందుకొచ్చింది.

ALSO READ : BREAKING : సూర్యాపేట గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య..!

అయితే దీని వినియోగం గురించి గూగుల్ తాజాగా ఒక వార్నింగ్ ఇచ్చింది. ప్రైవసీ రిస్కు గురించి కొన్ని సూచనలు కూడా చేసింది. గూగుల్ జెమినీ తో ఏ స్థాయి ఫలితాలు ఉంటాయని అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. దాంతో ఏఐ ప్లాట్ఫారంపై కొత్తగా హైప్ క్రియేట్ అయింది. అయితే జమినితో కూడా ప్రైవసీ రిస్క్ ఉంటుంది. డేటాను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.

ఏఐ ప్లాట్ఫార్మ్స్ ఇంకా అభివృద్ధి స్థాయిలోనే ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఏఐ చాట్ పార్ట్స్ కు వ్యక్తిగత డేటాను షేర్ చేస్తే సెక్యూరిటీ రిస్కులు వచ్చే అవకాశం ఉంది. దాంతో జెమినీ ఏ ఐ తో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి గూగుల్ పారదర్శకంగా ఉంటుంది. దీనికి యూజర్లు అందించే పర్సనల్ డేటాను సమీక్షించవచ్చునని, ఇది ప్రైవసీ గురించి ఆందోళనలు పెంచుతుందని వినియోగదారులను హెచ్చరించింది. జెమిని ఏ ఐ తో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి గూగుల్ పారదర్శకంగా ఉంటుంది.

ALSO READ : మిర్యాలగూడ వాసికి.. ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు