మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

హుజూర్‌నగర్, అక్టోబర్26  మన సాక్షి :
దేశవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిపోతున్న కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించడానికి లోక్ అదాలత్ ఒక్కటే ఏకైక మార్గమని సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు జిట్టా శ్యాంకుమార్, సాకేత్ మిత్ర లు అన్నారు.

బుధవారం న్యాయస్థాన ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహణ గురించి ఏర్పాటుచేసిన న్యాయవాదుల సమావేశంలో మాట్లాడుతూ
నవంబర్ నెల12వ తేదీన జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు.

ALSO READ : BREAKING : పట్టపగలే దొంగల బీభత్సం 

లోకదాలత్ ను నిర్వహించడానికి న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమని, న్యాయవాదుల సహకారం లేకుండా విజయవంతం చేయడం సాధ్యం కాదని, అందువల్ల లోక్ అదాలత్ విజయవంతం కొరకు న్యాయవాదులు కోర్టుకు సహకరించి,విజయవంతం చేయాలని కోరారు.రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, బ్యాంకు దావాలు, చెక్ బౌన్స్ కేసులు,కుటుంబ వివాదాల కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు,బాగ పంపిణీల కేసులు తదితర అన్ని కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, ప్రభుత్వ న్యాయవాది ఉప్పల గోపాలకృష్ణమూర్తి, రమణారెడ్డి, వట్టికూటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.