ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు

చండ్రుగొండ మండలం ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా, మానసికంగా లొంగదీసుకొని పెళ్లికి నిరాకరించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు

దమ్మపేట రూరల్, మన సాక్షి :

చండ్రుగొండ మండలం ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా, మానసికంగా లొంగదీసుకొని పెళ్లికి నిరాకరించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వెంకటియాతండాకు చెందిన ఓ యువతిని జర్పులాతండాకు చెందిన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమపేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు.

ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిపై ఒత్తిడి తేవడంతో యువకుడు మరొకరిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లి చూపులకు వెళ్తున్నాడు అని తెలుసుకున్న యువతి. వివాహం చేసుకోడని తెలుసుకున్న యువతి అతడిపై శుక్రవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది.