మాదాపూర్ డివిజన్ అభివృదికి అహర్నిశలు కృషి : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ డివిజన్ అభివృదికి అహర్నిశలు కృషి : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

శేరిలింగపల్లి , మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో పర్యటించి,చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కాలనీ సభ్యులతో సమీక్షించిన అనంతరం నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.

 

ALSO READ : 

  1. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  2. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
  3. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
  4. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

 

అనంతరం ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్ డివిజన్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ బిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు బి.శ్రీనివాస్, వార్డ్ సభ్యులు శ్రీనివాస్,నాయకులు నాగేశ్వరరావు,ప్రభాకర్, సాంబయ్య, ప్రసాద్, సత్యం, ప్రకాష్ రెడ్డి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.