DRUGS : మధ్యప్రదేశ్ టు హైదరాబాద్ డ్రగ్స్..!
DRUGS : మధ్యప్రదేశ్ టు హైదరాబాద్ డ్రగ్స్..!
మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి :
మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన రాచకొండ పోలీస్ బృందం. ఈ మేరకు నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ ఆఫీసులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్ కు చెందిన ఓం రామ్, సన్వల రామ్, మధ్యప్రదేశ్ కు చెందిన వికాస్ నుంచి డ్రగ్స్ కొన్నారు.
వీటిని హైదరాబాదులో అమ్మేందుకు సిటీకి వచ్చారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ సీఐ నాగరాజు నేతృత్వంలో అలాగే ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు సోమవారం జవహర్ నగర్ పరిధిలోని మల్కారం డంపింగ్ యార్డ్ వద్ద ఓం రామ్, సల్వానులను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ. 45 లక్షల విలువైన గసగసాల గడ్డి 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులో ఓం రామ్ కార్పెంటర్ గా, సన్మాల రామ్ రైలింగ్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు.
ఓం రామ్ పై రాజస్థాన్ లో డ్రగ్స్ కేసులు ఉన్నాయన్నారు. ఈజీ డబ్బు సంపాదించడం కోసం వీరిద్దరూ డక్స్ సప్లయర్ గా మారినట్లు ఆయన తెలిపారు. యొక్క డ్రగ్స్ రవాణాను మధ్యప్రదేశ్ నుండి బస్సులు లారీలు ట్రైన్లలో హైదరాబాదుకు సప్లై చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టు చేసిన ఓం రామ్, సన్మాల రామ్ లపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు చేశామన్నారు. మరో నిధులు వికాస్పరాలు ఉన్నట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Jurala project : జూరాలకు కొనసాగుతున్న భారీ వరద… తెరుచుకున్న 37 గేట్లు..!
రుణమాఫీ ప్రక్రియను బ్యాంకులలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!









