మహారాష్ట్రలో జరిగే జాతీయ యువజన ఉత్సవాలకు మిర్యాలగూడ యువకుడికి ఆహ్వానం..!

స్వామి వివేకానంద జయంతి జనవరి 12న సందర్భంగా కేంద్ర యువజన , క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో వారం రోజులపాటు జాతీయ యువజన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.

మహారాష్ట్రలో జరిగే జాతీయ యువజన ఉత్సవాలకు మిర్యాలగూడ యువకుడికి ఆహ్వానం..!

మిర్యాలగూడ, మనసాక్షి:

స్వామి వివేకానంద జయంతి జనవరి 12న సందర్భంగా కేంద్ర యువజన , క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో వారం రోజులపాటు జాతీయ యువజన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 27వ జాతీయ యువజన ఉత్సవాలు జనవరి 12-17 వరకు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది.

ALSO READ : తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ఈ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12న నాసిక్ లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా నుంచి ఏడుగురిని ఎంపిక చేయడం జరిగింది. అందులో మిర్యాలగూడ చెందిన నేరేళ్ల అజయ్ ని ఎంపిక చేయడం జరిగింది.

ALSO READ : హైదరాబాద్ : 13 దేశాల ప్రతినిధులకు రేవంత్ రెడ్డి ఆతిథ్యం..!

గతంలో న్యూఢిల్లీలో నిర్వహించిన అమృత్ వాడిక , మేర మట్టి మేర దేశ కూడా ఎంపిక కావడం చాలా చెప్పుకోదగిన విషయం. ఈ కార్యక్రమానికి గ్రామాలలో పట్టణంలో అజయ్ చేసిన కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ ఆహ్వానం అందించారు.