Mahashivarathri : మహాశివరాత్రి ఉత్సవాలకు శివాలయాల ముస్తాబు..!

మాడ్గుల మండలంలోని అవురుపల్లి - నల్లవారి పల్లి, ఆర్కపల్లి, కొలుకులపల్లి, మాడ్గుల, తదితర గ్రామాలలోని శివాలయాలను ఈ నెల 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు అందంగా ముస్తాబు చేస్తున్నారు.

Mahashivarathri : మహాశివరాత్రి ఉత్సవాలకు శివాలయాల ముస్తాబు..!

నాగులగుట్టపై మూడు రోజులు అన్నదాన కార్యక్రమం..

రంగారెడ్డి జిల్లా, మాడ్గుల, మన సాక్షి:

మాడ్గుల మండలంలోని అవురుపల్లి – నల్లవారి పల్లి, ఆర్కపల్లి, కొలుకులపల్లి, మాడ్గుల, తదితర గ్రామాలలోని శివాలయాలను ఈ నెల 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. మండలంలోని అవురుపల్లి- నల్లవారి పల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న నాగుల గుట్టపై వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద ఈనెల 8వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి వార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మారుపాకుల దేవుని రాములు తెలిపారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 7వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకు గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి, ఎల్లమ్మ దేవి, నవగ్రహ పూజల తోపాటు ఏకదశ రుద్రాభిషేకం, శివపంచాక్షరి జప యజ్ఞాలు నిర్వహించిన అనంతరం సాయంత్రం నల్లవారి పల్లి గ్రామం నుండి దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగింపుగా భక్తుల శివనామ స్మరణతో నాగుల గుట్టకు చేరును.

అనంతరం ఒగ్గు కళాకారుల బృందం మల్లన్న దేవుని ఒగ్గు కథ ప్రదర్శన నిర్వహిస్తారని, 8వ తేదీ శుక్రవారం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామివార్ల కళ్యాణం అనంతరం కడవ వెళ్ళుట, బోనాల కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహిస్తారని, 9వ తేదీ శనివారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు, తీర్థప్రసాదాలు, చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ధర్మకర్త దేవుని రాములు పేర్కొన్నారు. నాగుల గుట్టపై మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయానికి వచ్చే భక్తులకు మూడు రోజులపాటు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహణ కమిటీ సభ్యులు మారుపాకుల వెంకటయ్య గౌడ్ తెలిపారు.

ALSO READ : Suicide : 12 రోజుల్లో పెళ్లి.. అంతలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఆత్మహత్య..!