హామీల అమలుకు దేశ బడ్జెట్ కూడా సరిపోదు.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి దేశ బడ్జెట్ కూడా సరిపోదని బి జె ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

హామీల అమలుకు దేశ బడ్జెట్ కూడా సరిపోదు.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి దేశ బడ్జెట్ కూడా సరిపోదని బి జె ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 

 మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు యధావిధిగా

……………………………………………
రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీల అమలుకు దేశ బడ్జెట్ కూడా సరిపోదు

అధికారం కోసం అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి..ఇప్పుడు నిధులు కేటాయించలేక రాష్ట్ర సర్కార్ అభాసుపాలవుతోంది

రైతులను, నిరుద్యోగులను, ఎస్సీ,ఎస్టీ,బీసీలను రాష్ట్ర సర్కార్ మోసం చేసింది

బడ్జెట్ పద్దులపై డిప్యూటీ సీఎం క్లారిఫికేషన్ రాజకీయ ప్రసంగంలా ఉంది

హామీలు బారెడు, నిధులు మూరెడు అన్నట్లుగా బడ్జెట్ కేటాయించారు
…………………….

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ కేసిఆర్ సర్కారు చేసిన తప్పులనే చేస్తోంది

అరవై వేల కోట్లు అప్పులు చేస్తామని Budget at a Glance నోట్ లో పేర్కొంది తెలంగాణ పరిస్థితి పెనం నుంచి జారి పొయ్యిలో పడినట్లు అయింది

ALSO READ : మాకు కొట్లాట కొత్తేమీ కాదు.. కేటీఆర్ ట్వీట్ ఆసక్తి కరం..!
……………………………………….

వ్యవసాయ రంగానికి 19,746 కోట్ల కేటాయింపులు చేశారు, సరే
ఈ నిధులతో 2 లక్షల రుణమాఫీ చేస్తారా…15వేల రైతు భరోసా ఇస్తారా..

పంటకు 500బోనస్ ఇస్తారా…24 గంటల ఉచిత కరెంట్ ఇస్తారా….
మీరిచ్చిన బడ్జెట్ ఒక్కరుణమాపీ అమలు చేయడానికి కూడా సరిపోదు
…………………..

ఇక ఇందిరమ్మ ఇళ్లు పధకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు 3,500 ఇండ్లు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇంటికి ఐదు లక్షల చొప్పున లెక్కిస్తే 20,825 కోట్లు అవసరం. మరి బడ్జెట్ లో కేటాయించినది 7,740 కోట్లు మాత్రమే. అంటే మూడోవంతు మాత్రమే కేటాయించారు. ఇది పేదలకు మొండి చెయ్యి ఇవ్వటమే.

ఇండ్ల పథకానికి ప్రధాని ఆవాస్ యోజన నిధులను వాడుకుంటామని బడ్జెట్ లో పేర్కొన్నారు, అలాంటప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మాజీ ప్రధాని వాజ్ పాయ్ గారి పేరును కూడా చేర్చాలి.

ALSO READ : నందికొండలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!
………………………..

రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 4000 చొప్పున ఇస్తామన్న భృతి ఏమైంది.
ఈ లెక్కన నిరుద్యోగులకు జనవరి మాసానికి 1400 కోట్లు రేవంత్ సర్కారు నిరుద్యోగులకు బాకీ పడింది.
ఇచ్చిన హామీలను కేసిఆర్ సర్కారు ఎగ్గొట్టిన విధంగానే రేవంత్ సర్కారు ఎగ్గొట్టాలని చూస్తోంది. ఇదీ ముమ్మాటికి నిరుద్యోగులను మోసం చేయడమే.
…………………..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలుకు సాధ్యం కావాని చెప్పకనే చెప్పినట్లు ఉంది.
కనీసం వారు అనుకుంటున్న ఆరు గ్యారంటీలకైనా సరిపోను నిధులు ఇవ్వడం లేదు.
బడ్జెట్ లో కేవలం 53,196 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఆరు హామీల అమలుకే దాదాపు 1లక్షా 50వేల కోట్లు ఖర్చు అవుతాయి. కేటాయించింది మాత్రం మూడో వంతు మాత్రమే.
……………………………….

ALSO READ : BREAKING : ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా..  వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

ఇలా గ్యారంటీలు, వారంటీల పేరుతో భారీగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..తీరా బడ్జెట్ లో వాస్తవ పరిస్థితిలోకి వచ్చే సరికి చేతులెత్తేసి నిధులు కేటాయించలేకపోయింది, ఇదీ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే.

………………