Breaking NewsfoodTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణహైదరాబాద్

How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!

How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

ప్రతి ఒక్కరికి పెరుగు భోజనంలో ఒక భాగం ప్రతి ఒక్కరు కూడా పెరుగు తియ్యగా ఉంటేనే తినాలని అనుకుంటారు. పుల్లగా ఉన్న పెరుగు తినడం వల్ల ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు. అందుకని తియ్యగా ఉండే పెరుగును ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

 

కొన్ని చిట్కాలు పాటిస్తే పెరుగు తియ్యగా, గడ్డలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు .పెరుగు గట్టిగా, తీయగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి. సాధారణంగా బయట కొనుగోలు చేసిన పెరుగు అంత రుచిగా ఉండదు. అయిన తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది.

 

కానీ ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు చాలా రుచిగా ఉంటుంది. తియ్యగా ఉంటుంది . కొంతమందికి పెరుగు తీయగా ఉన్నప్పటికీ గడ్డలా తోడుకోదు. అలాంటప్పుడు ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.

 

పచ్చిమిరపకాయ వేసి తోడు పెట్టడం వల్ల పెరుగు గడ్డల చక్కగా తోడుకుంటుంది. పాలు తోడు పెట్టినప్పుడు పైనుంచి ఒక మిరపకాయ వేయాలి. ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చిలోని బ్యాక్టీరియా పాలలో కలిపి పెరుగుని చిక్కగా తీయగా మారుస్తుంది.

 

ALSO READ : 

  1. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
  2. వరంగల్ లో భూకంపం.. 3.6 తీవ్రత ..!
  3. Chennai : దారి తప్పిన కుమార్తెను.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!
  4. Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)
  5. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం

 

పెరుగు తోడవడానికి రెండు పద్ధతులు : 

పెరుగు తోడవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. గోరువెచ్చని పాలలో పెరుగు తోడు వేయండి. తర్వాత ఓ మిరపకాయ వేయండి. దానివల్ల పెరుగు చక్కగా తోడుకుంటుంది. పిచ్చి మిరపకాయ కాడతో సహా వేయాలి. తర్వాత ఆ పెరుగుపై వీలైతే కాటన్ గుడ్డ వేసి మూత పెట్టండి. మరుసటి రోజు ఉదయానికి పెరుగు గట్టిగా అవుతుంది.

 

దీనిని ఫ్రిజ్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల పెరుగు గట్టిగా, తీయగా ఉంటుంది . ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పెరుగు చక్కగా ఉంటుంది .రుచి కూడా ఉంటుంది.

 

పాలను బాగా మరిగించడం చాలా ముఖ్యం : 

పెరుగు తోడు పెట్టడానికి ముందు పాలను బాగా మరిగించడం చాలా ముఖ్యం . అదేవిధంగా పాలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తోడు పెట్టకూడదు. తోడు కూడా ఓ చిన్న టీ స్పూన్ తో రెండు టీ స్పూన్లు వేస్తే సరిపోద్ది . ఇలాంటివన్నీ పాటిస్తే పెరుగు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చును. దానివల్ల తియ్యగా , గట్టిగా రుచికరంగా తయారవుతుంది.

మరిన్ని వార్తలు