Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Narayanpet: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి..!
Narayanpet: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధి లో భాగస్వాములు కావాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బదిలీపై వచ్చిన కలెక్టర్ ను గురువారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే శ్రీహరి కోరారు. అదేవిధంగా జడ్పీ చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్, డి.ఎస్.పి లింగయ్య కలెక్టర్ ను కలిసి పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ALSO READ :









