Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : సాగర్ ఎడమ కాలవలో పడి వ్యక్తి మృతి..!

Miryalaguda : సాగర్ ఎడమ కాలవలో పడి వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నాగార్జున సాగర్ ఎడమ కాలవలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని దొండవారిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో నివాసం ఉంటే పొడకంటి వెంకటాచారి (32) బంధువులతో కలిసి ఈనెల 13వ తేదీన సొంత గ్రామమైన దొండవారిగూడెం వెళ్లారు.

కాగా సాయంత్రం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న సాగర్ ఎడమ కాలువ వద్ద సానం చేయడానికి వెళ్లి ఈత కొడుతున్న క్రమంలో కాలువలో గల్లంతయ్యాడు.

కాగా వెంకటాచారి భార్య సుష్మ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, గడ్డిపల్లి సమీపంలో మృతదేహం లభించింది. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు