నాసిరకంగా మన ఊరు మనబడి పనులు.. విచారణ చేయాలని ఫిర్యాదు..!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని పైనంపల్లి లో మన ఊరు మన బడి కింద చేపట్టిన పనుల పై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు

నాసిరకంగా మన ఊరు మనబడి పనులు.. విచారణ చేయాలని ఫిర్యాదు..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని పైనంపల్లి లో మన ఊరు మన బడి కింద చేపట్టిన పనుల పై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని పైనంపల్లి ప్రభుత్వ పాఠశాలలో రూ.20 లక్షలతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయిని ఆరోపించారు.

ఏడాది లోపు పైపులు పగిలాయని అన్నారు. పనులు మొత్తం నాసిరకంగా చేపట్టారని అన్నారు. ప్రభుత్వ సొమ్ము ను దుర్వినియోగం చేసిన సదరు కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారి నుంచి డబ్బులు . రికవరి చేయాలని కోరారు.