అతి త్వరలో ప్రజలకు చేరువైన పత్రిక మనసాక్షి

ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధి పత్రికలని , ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేర వేయడంలో వాటి పాత్ర కీలకమని వేములపల్లి బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి అన్నారు.

అతి త్వరలో ప్రజలకు చేరువైన పత్రిక మనసాక్షి

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు

– రావులపెంటలో మన సాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

వేములపల్లి, మన సాక్షి:

ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధి పత్రికలని , ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేర వేయడంలో వాటి పాత్ర కీలకమని వేములపల్లి బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి అన్నారు.

బుధవారం రావులపెంట గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి లుతో కలిసి మనసాక్షి దినపత్రిక 2024 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ALSO READ : IMP NEWS : పేపర్,  పాలు డెలివరీ చేసే వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పాలి..!

ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో మనసాక్షి దినపత్రిక ప్రజలకు ఎంతో చేరువైందన్నారు.సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజులలో మనసాక్షి పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నాయన్నారు.

జర్నలిస్టులు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తరి సైదులు, గ్రామ శాఖ అధ్యక్షులు సందనబోయిన చంద్రయ్య, వార్డు మెంబర్ శీలం సైదులు, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు కత్తుల సైదులు, మన సాక్షి పత్రిక విలేఖరి శీలం వినయ్ గౌడ్ పాల్గొన్నారు.

ALSO READ : ఆంధ్రప్రదేశ్ లో మనసాక్షికి పెరుగుతున్న ఆదరణ.. వైసిపి ఎమ్మెల్యే రెడ్డి శాంతి..!