Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

IMP NEWS : పేపర్,  పాలు డెలివరీ చేసే వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పాలి..!

IMP NEWS : పేపర్,  పాలు డెలివరీ చేసే వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పాలి..!

 శంకర్‌పల్లి సీఐ వినాయక్ రెడ్డి

శంకర్‌పల్లి: (మన సాక్షి):

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఊళ్ళల్లోకి వెళ్లే శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని శంకర్‌పల్లి సిఐ. వినాయక్ రెడ్డి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మీ ఇంటికి నిఘా నేత్రాలు పెట్టించుకోవాలని, ఏదైనా అను మాన స్పదంగా ఉంటే మిమ్మల్ని అప్రమత్తం చేయమని మీ ఇరుగు పొరుగు వారికి చెప్పాలని, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను, బంగారు, వెండి ఆభరణాలు, నగదుకు సంబంధించి ఎవరితోనూ చొప్పదని, లాకర్లో పెట్టుకుంటే మంచిదన్నారు.

సొంత వాహనాలు ఇంటి ఆవరణ రోడ్లపై కాకుండా ఇంట్లోనే పెట్టాలని, తాళాలను మీతో పాటు తీసుకెళ్లాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టవద్దని తెలిపారు.

ALSO READ : సూర్యాపేట : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం..!

తలుపులకు తాళం వేయడానికి నాణ్యమైన తాళాలను మాత్రమే ఉపయోగించాలని, ఏదైనా ఒక గదిలో విద్యుత్ లైట్ వెలిగించాలని, పేపర్, పాలు, డెలివరీ చేసే వారిని ఇంటికి రావద్దని చెప్పాలన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల వాళ్ల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల న్నారు.

స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్లను సేవ్ చేసుకోవాలని, తప్పనిసరిగా పోలీసులకు టచ్ లో ఉండాలని, ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100 నెంబర్ కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా ప్రజలతో మమేకమై విధి నిర్వహణలో నిమగ్నమవుతామన్నారు.

ALSO READ : తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి..!

మరిన్ని వార్తలు