ManaSakshi : మనసాక్షి కథనంతో.. నిరుపేద మహిళకు నిలిచిన గూడు..!

ManaSakshi : మనసాక్షి కథనంతో.. నిరుపేద మహిళకు నిలిచిన గూడు..!

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో నిరుపేద అయిన ఒంటరి మహిళను చేర దీయడానికి ఎవరూ లేని మతిస్థిమితం కూడా సరిగా లేని అభాగ్యురాలు రాచమల్ల పద్మ కు ఉండటానికి ఇల్లు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బ్రతుకే భారంగా వెల్లదీస్తుండడంతో..

 

ఇటీవల మనసాక్షి లో ప్రచురించిన బ్రతికే భారంగా మారిన చిత్రం అనే కథనం చూసి స్పందించిన కొందరు గ్రామ యువత సహాయంతో దాతలు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడంతో ఆమెకు ఒక రేకుల ఇల్లు నిర్మించి పులిగిల్ల గ్రామ యువత ఆధ్వర్యంలో ఆమెకు అందించడం జరిగింది.

 

దీనితో ఆమెకు ఆనందానికి ఆధులు లేకుండా పోయాయి. కొత్త ఇల్లును అందించడమే కాకుండా ఒక నెల రోజులకు సరిపడ కిరాణా సామాగ్రిని అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కారోబార్ పైళ్ళ గణపతి రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సహాయం చేయాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది కానీ దాని ఆచరణలో పెట్టి ముందుకు వచ్చి సహాయం చేయాలన్న గుణం కొందరికే ఉంటుంది.

 

ఏది ఏమైనప్పటికీ ఉండటానికి నీడన ఏర్పాటు కోసం గ్రామ యువత సహాయం కోరగా వెంటనే స్పందించి తమకు తోచినంతగా 80 వేల రూపాయలను సమకూర్చి ఇచ్చి ఆమెకు ఇల్లు కట్టుకున్నకు తోడ్పడిన దాతలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

 

ALSO READ : 

1. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!

2. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

3. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

4. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

 

ఇలాంటి దాతలు సాయం చేయాలనే గుణం ఉన్న వారు ఉన్నంతకాలం దేశంలో నిరుపేదలు అనేవారు ఉండరు. ఎంతో కొంత లో సహాయపడి తమకున్న దానిలోనే కొంత మొత్తంలో సహాయం చేసి పలు నిరుపేదల కుటుంబాలకు ఆసరాగా నిలవడం వల్ల దేశంలో దారిద్రం పేదరికం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు.

 

 

గ్రామ యువతను అభినందించిన గ్రామ సర్పంచ్ :

 

ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చి తమ యొక్క సమయాన్ని కేటాయించి గృహక్ నిర్మాణ అవసరం కోసం కావాల్సిన సామాగ్రిని అందించి నిరంతరం కష్టపడిన ఆలేటి మహేష్ నక్కల నరేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు గ్రామ ప్రజల అందరి తరపున తెలియజేశారు. ఇలాంటి సమాజ సేవకు మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన గ్రామ యువకులకు ఇలాంటి మరెన్నో మంచి పనులు చేయాలని ఆశిద్దాం. గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న యువతకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు ఎల్లయ్య, కోలన్ రాంరెడ్డి బుగ్గ వెంకటేశం, వడ్డేమాన్ ఎల్లయ్య, రాచమల్ల స్వామి, కల్లెం జంగారెడ్డి, వేముల శేఖర్, నక్కల అనిల్ తదితరులు పాల్గొన్నారు.