మనసాక్షి కి స్పందన.. పాఠశాల సందర్శించిన ఆర్డీఓ,డీఎస్పీ..!
మనసాక్షి కి స్పందన.. పాఠశాల సందర్శించిన ఆర్డీఓ,డీఎస్పీ..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ లోని ఆదర్శ పాఠశాలను స్థానిక అధికారులు సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించడానికి హామీ ఇచ్చారు.
దేవరకొండ ఆదర్శ పాఠశాల పక్కన ఉన్న కోళ్ల ఫారం నుంచి వచ్చే దుర్వాసనతో విద్యార్థులకు సమస్య నెలకొన్నది. ఈ విషయాన్ని విద్యార్థులు మనసాక్షి పత్రిక దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ప్రచురించడంతోపాటు పత్రికలో ప్రచురించింది. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
దాంతో శుక్రవారం మనసాక్షి కథనానికి స్పందించిన అధికారులు ఆర్డీవో శ్రీరాములు, డీఎస్పీ గిరిబాబు, సీఐ నరసింహులు తహసిల్దార్ సంతోష్ కిరణ్, ఎంపీడీవో లినిమ పాఠశాల సందర్శించడం జరిగింది. పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో స్థలం యొక్క యజమానులు కోళ్ల ఫారం ఏర్పాటు చేయడంపై విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
దీనివల్ల దుర్వాసన తో అనారోగ్యం పాలై వాంతులు విరోచనాల గురవుతున్నారని విద్యార్థులతో అధికారులు మాట్లాడడం జరిగింది. విద్యార్థులకు దుర్వాసన రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట పాఠశాల, ఆర్ ఐ గోప రాజు, ప్రిన్సిపాల్ సువర్ణ, కొండ భీమనపల్లి సెక్రటరీ శ్రీనివాసులు, ఉన్నారు. దాంతో విద్యార్థులు ఉపాధ్యాయులు మనసాక్షి కథనానికి అభినందనలు తెలిపారు.
LATEST UPDATE :
Miryalaguda : రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక..!
TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!









