సూర్యాపేట : మెడికల్ కాలేజ్ లో ఘనంగా ఫ్రేషేర్స్ డే వేడుకలు

సూర్యాపేట : మెడికల్ కాలేజ్ లో ఫ్రేషేర్స్ డే వేడుకలు

ముఖ్య అతిథి గా పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట, మనసాక్షి : జీవితం లో మంచి జ్ఞాపకాలు ఇచ్చే పద్దతుల్లో విద్యార్థులు వైద్య విధ్య ను కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ లో జరిగిన ఫ్రేషెర్స్ డే వేడుకలకు ముఖ్య అతిధి గా హాజరైన మంత్రి మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు , జూనియర్ల తో స్నేహ పూర్వకంగా మెలగాని సూచించారు. అవతలి వ్యక్తుల నుండి గౌరవాన్ని పొందే లే ప్రవర్తించాలని కోరారు.. సూర్యాపేట మెడికల్ కాలేజ్ ను స్థాపించిన మూడు ఏళ్ల లోనే దేశ వ్యాప్తంగా పేరు సంపాదించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు..

దీనికి కి కారణం అయిన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శారదా దేవి, సూపరిడెంట్ మురళీధర్ రెడ్డి సేవలను మంత్రి కొనియాడారు. వైద్య సిబ్బంది, విద్యార్థులు , వైధ్యేతర సిబ్బంది కృషి తో కరోనా కాలం లో వేలాది మంది రోగులు ప్రాణాలను నిలబెట్టుకున్నారన్నారు. భవిష్యత్ లోనూ ఇదే రకమైన సేవలు అందించి సూర్యాపేట కు మంచి పేరు తేవాలని మంత్రి కోరారు.

త్వరలోనే సొంత బిల్డింగ్ కు మారనున్న మెడికల్ కాలేజ్ విద్యార్దులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల సామగ్రి ని సమకూర్చామని మంత్రి అన్నారు.ఈ సందర్బంగా విధ్య విద్యార్ధులు చేసిన సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.