తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యంసూర్యాపేట జిల్లా

District Collector : సమయ పాలన పాటిస్తూ ప్రజలకి వైద్య సేవలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District Collector : సమయ పాలన పాటిస్తూ ప్రజలకి వైద్య సేవలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

సూర్యాపేట , మనసాక్షి:

పేదవారికి ప్రభుత్వ హాస్పిటలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకం తో ప్రభుత్వ హాస్పిటల్ కి వస్తున్నారని వారి నమ్మకాన్ని నిజం చేసేలా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటల్ లో సేవలు అందించాలని సూచించారు.

మాత శిశు సంరక్షణ కేంద్రం పరిశీలించి ప్రసవాలు రోజు వారీగా, నెల వారీగా ఎన్ని అవుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.మాత శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చే పెషేంట్స్ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు.

ప్రసూతి కోరకు తీసుకొచ్చిన ఆశ కార్యకర్తలతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.తదుపరి ఎమర్జన్సీ చైల్డ్ కేర్ సెంటర్ ను పరిశీలించి తక్కువ బరువు తో పుడుతున్న బేబి లకు , పచ్చ కామెర్లు వచ్చిన బేబీ లకు , నెలలు రాకముందు పుట్టిన బేబీ లకు అందిస్తున్న చికిత్స లను సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఊపిరితిత్తులలో నిమ్ము తో ఇబ్బంది పడుతున్న మరియన్న తో కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలు అందించాలని సిబ్బంది కి సూచించారు. ఒపీ, ఐపీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు కి సంబందించిన రిజిస్టర్లని పరిశీలించారు. సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకి వైద్య సేవలు అందించాలని అన్నారు.

రోగ నిర్దారణ పరీక్షలు చేసే టి హబ్ సెంటర్ ని , సెంట్రల్ డ్రగ్ సెంటర్,ఫార్మసి స్టోర్ లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకొని అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని లేని వాటిని ముందుగానే తెప్పించుకోవాలని ఆదేశించారు. మందులు లేవు చెప్పకూడదని లోని వాటిని వెంటనే తేప్పించాలని అన్నారు.

జి జి హేచ్ ఆవరణలో నిర్మిస్తున్న నూతన బిల్డింగ్ ని కలెక్టర్ పరిశీలించారు. కూలీలను ఎక్కువ గా ఏర్పాటు చేసుకొని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా కృషి చేయాలని కాంట్రాక్టర్ కి సూచించారు.
ఈ కార్యక్రమం లో రెసిడెన్సీ మెడికల్ ఆఫిసర్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సంధ్య, డాక్టర్ ప్రశాంతి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

 

మరిన్ని వార్తలు