Nalgonda : మెడికల్ షాపులలో మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు.. సిగరెట్ పెట్టెలలో పెట్టి అధిక ధరలకు విక్రయం..!

ఎలాంటి మెడికల్ డిస్క్రిప్షన్ లేకుండా మత్తు కోసం యువకులకు టాబ్లెట్లు ఇంజక్షన్లు అమ్ముతున్న మెడికల్ షాప్ యజమానిని సేవిస్తున్న యువకులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

Nalgonda : మెడికల్ షాపులలో మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు.. సిగరెట్ పెట్టెలలో పెట్టి అధిక ధరలకు విక్రయం..!

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్పీ చందన దీప్తి

నల్లగొండ, మనసాక్షి:

ఎలాంటి మెడికల్ డిస్క్రిప్షన్ లేకుండా మత్తు కోసం యువకులకు టాబ్లెట్లు ఇంజక్షన్లు అమ్ముతున్న మెడికల్ షాప్ యజమానిని సేవిస్తున్న యువకులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. శుక్రవారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..నమ్మదగిన సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా తెల్లవారుజామున, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్, అల్ట్రా కింగ్ మరియు ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు కలిగివున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

ALSO READ : Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!

విచారించగా నిందితుడు జబీయుల్లా,ఎండీ సల్మాన్ లు ఈ మాత్రలను ఇంజక్షన్‌లు అలవాటుగా గత 3 సంవత్సరాల నుండి, మత్తు అనుభూతిని పొందడానికి రోజుకు కొన్ని ఎక్కువ మోతాదులో సేవిస్తున్నామని, వీరు నల్గొండలోని శివాజీ నగర్ లోని న్యూ హెల్త్ కేర్ ఫార్మసీకి చెందిన తౌడోజు నరేష్ ప్రొప్రైటర్, వద్ద ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్‌లు మరియు ఇంజెక్షన్‌లను కొనుగోలు చేసి సేవిస్తూ ఎవ్వరికీ డౌట్ రాకుండా సిగరెట్ పెట్టలో పెట్టి బయట వ్యక్తులకు ఎక్కువ దరకు విక్రయించడం కూడా జరుగుతుంది అని తెలిపారు.

వీరి వద్ద నుండి స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ టాబ్లెట్స్ 4032, అల్ట్రా కింగ్ టాబ్లెట్స్ 585,
ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు టాబ్లెట్స్ 300 స్వాదీనము చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే మత్తు టాబ్లెట్లు ఇంజక్షన్లు సేవిస్తున్న నేరస్తులు నల్లగొండ పట్టణం రెహమాన్ బాగుకు చెందిన మహమ్మద్ జబీ ఉల్లా,  తౌడోజు నరేష్, మెడికల్ షాప్ యజమానీ మన్యంచల్క, మిర్యాలగూడ రోడ్డు, నల్గొండ పట్టణం, మహ్మద్ సల్మాన్  రోడ్ నెం.5, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ రోడ్, నల్గొండలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ALSO READ : BREAKING : టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజీనామా..!

తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని అక్రమ గంజాయి రవాణాను మరియు ఇతర మత్తుమందుల విక్రయిస్తే కటిన చర్యలు తప్పవు అని అన్నారు. యువత మాదక ద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగానికి గురికావద్దని, వాటిని విక్రయించే లేదా వినియోగిస్తున్న వ్యక్తుల సమాచారం గురించి తెలిస్తే, సంబందిత పోలీసు స్టేషన్ గాని డయల్-100 ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి మెడికల్ ప్రిస్క్రిప్ లేకుండా మెడికల్ షాప్ యజమానులు మత్తు కలిగించే టాబ్లెట్స్, ఇంజెక్షన్‌లు విక్రయిస్తే కటిన చర్యలతో పాటూ వారి యొక్క ఆస్తులను జప్తు చేస్తూ పి.డి యక్ట్స్ లు నమోదు చేయబడుతాయి అని ఎస్పీ హెచ్చరించారు.

ALSO READ : Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!