Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవరంగల్ గ్రామీణ జిల్లావరంగల్ పట్టణ జిల్లా

BREAKING : టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజీనామా..!

BREAKING : టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజీనామా..!

వరంగల్, మన సాక్షి :

బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది . ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా బీఆర్ఎస్ పార్టీని వీడి స్థానిక నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసిఆర్ కు పంపనున్నట్లు పేర్కొన్నారు.

ఆయన గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పాటు ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు ఇస్తామని బుజ్జగించినట్లు సమాచారం. అప్పట్లోనే ఆయనను బుజ్జగించేందుకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇచ్చారు. కానీ ఆయన, ఆయనతో పాటు ఆయన వర్గీలంతా అసంతృప్తితోనే ఉన్నారు.

ALSO READ : Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరికి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. దాంతో ఆయన గెలుపొందారు. కానీ రాజయ్య మాత్రం అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవల ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కూడా రాజయ్యకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేసి మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున బీఆర్ఎస్ కు చెందిన స్థానిక నేతలు ఆయన వర్గీయులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ : Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!

మరిన్ని వార్తలు