మేమేమీ పాపం చేశాం..!

రెండేళ్ల కిత్రం తల్లి... నాలుగు నెలలు క్రితం తండ్రి ఇరువురు చిన్నారులను వదిలి వెళ్లిన వైనం. నాయనమ్మ కు భారంగా మారిన చిన్నారుల పోషణ మా అమ్మనాన్నలకు చెప్పండి అంటూ రోధిస్తున్న చిన్నారులు. నేలకొండపల్లి తల్లిదండ్రుల ఆలనా, పాలన లో సంతోషంగా గడపాల్సిన చిన్నారులు...అనాధలుగా ఎదురు చూస్తున్నారు.

మేమేమీ పాపం చేశాం..!

నేలకొండపల్లి, మనసాక్షి:

రెండేళ్ల కిత్రం తల్లి… నాలుగు నెలలు క్రితం తండ్రి ఇరువురు చిన్నారులను వదిలి వెళ్లిన వైనం. నాయనమ్మ కు భారంగా మారిన చిన్నారుల పోషణ మా అమ్మనాన్నలకు చెప్పండి అంటూ రోధిస్తున్న చిన్నారులు. నేలకొండపల్లి తల్లిదండ్రుల ఆలనా, పాలన లో సంతోషంగా గడపాల్సిన చిన్నారులు…అనాధలుగా ఎదురు చూస్తున్నారు.

రెండేళ్ల క్రితం… తల్లి… నాలుగు నెలల క్రితం తండ్రి చిన్నారులను వదిలి వారి సంతోషం ను వెతుకున్నారు. కానీ వారి ఆలనా, పాలన వయో వృద్ధురాలైన నాయనమ్మ నీడ లో కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరికైనా మా అమ్మనాన్న కనిపిస్తే చెప్పండి… మీ పిల్లలు రోడ్డు న పడ్డారని రోధిస్తున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం.. సర్వత్ర చర్చ..!

ఖమ్మం జిల్లా, నెలకొండపల్లి మండలం లోని
మంగాపురంతండా కు చెందిన ఇస్లావత్ గాంధీ- నాగమణి దంపతులు గత కొంతకాలంగా మంచిగా కాపురం సాగింది. వీరికి ఇరువురు పిల్లలు పుట్టారు. తరువాత కాపురంలో చిచ్చు రగిలింది. వీరికి మణికంఠ (12), తేజస్విన్ (13) లు ఉన్నారు. గత రెండేళ్ల క్రితం కుటుంబంలో విబేధాల వలన తల్లి భర్త, పిల్లలను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంత కాలంగా పిల్లలను తండ్రి గాంధీ బాగానే చూసుకున్నాడు. ఆయన గత నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పిల్లలను వదిలి వెల్లిపోయాడు. రోజు తల్లి, తండ్రుల కోసం చిన్నారులుఎదురు చూస్తున్నారు.

తండ్రి కూడ వదిలేసిన తరువాత నాయనమ్మ వయోవృద్దురాలైన కమిలి (70) పిల్లల ఆలనా, పాలనా చూస్తుంది. ఆమ బ్రతకటమే కష్టంగా మారిన తరుణంలో చిన్నారులను చదివించటం, జీవనం కోసం నానా తంటాలు పడుతుంది. పిల్లలకు తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ప్రతీ రోజు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ALSO READ : వంద సంవత్సరాలు దాటిన ఓటర్లు ఉన్నారా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..!

మేమేమీ పాపం చేశాం అమ్మ.. నాన్న…మా కెందుకు ఈ శిక్ష అంటూ రోధిస్తున్నారు. తామిద్దరం రోడ్డ న పడ్డామని మా తల్లిదండ్రులు చెప్పండి అంటూ… వారి జాడ తెలిస్తే తమకు చెప్పండి అంటూ ప్రతీ రోజు వీధుల వైపు వారి రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరుపెడుతున్నారు.