Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

హైదరాబాద్, మనసాక్షి :

హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్ అండ్ టి సంస్థ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. విద్యార్థులకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు ఎల్ అండ్ టి తెలియజేసింది. విద్యార్థులకు మెట్రో రైల్ లో పాస్ లు అందించనున్నట్లు తెలిపారు.

 

మెట్రో రైల్ లో విద్యార్థులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణం చేయవచ్చునని తెలియజేశారు. 2023 జూలై 1వ తేదీ నుంచి దీనిని అమలు చేస్తున్నారు.

 

ALSO READ : 

1. TRAINS | నల్గొండ, మిర్యాలగూడలో ఇకపై ఆ.. రైళ్లు ఆగనున్నాయి..!

2. RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

3. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

4. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

5. Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!

 

విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు మెట్రో రైల్లో వెళ్ళటం చాలా ఈజీగా మారింది. వారికి 9 నెలల పాటు మెట్రోపాస్ జారీ చేయనున్నారు. 2023 జూలై 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు ఈ పాస్ లు జారీ చేయనున్నారు.

 

మెట్రోలో విద్యార్థులు పాస్ పొందడానికి విద్యార్థులు కళాశాల గాని పాఠశాల గాని గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎల్ అండ్ టి పేర్కొన్నది.

 

మరిన్ని వార్తలు