Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

కల్తీ పాల తయారీ దారుల అరెస్టు

కల్తీ పాల తయారీ దారుల అరెస్టు

నల్గొండ , మనసాక్షి,

యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల తయారీ ఘటన కలకలం రేపింది. ఈ ఘటన వెలుగు చూడడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న అదే గ్రామానికి చెందిన కప్పల రవి అనే వ్యక్తిని భువనగిరి ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ : బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ బస్సు పల్టీ ఇద్దరు మృతి,  పలువురికి గాయాలు..!

అతని వద్ద నుండి 350 లీటర్ల కల్తీ పాలు, 100 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాటు 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో అదే గ్రామానికి చెందిన కుంభం రఘు అనే కల్తీ పాల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ : Accident News : లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

అతని వద్ద నుండి 100 లీటర్ల కల్తీ పాలు, 200 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాటు 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు