Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : మంత్రి జగదీష్ రెడ్డి పై సంచలన ఆరోపణ.. సవాల్ విసిరిన సంకినేని..!

మంత్రి జగదీష్ రెడ్డి పై సంచలన ఆరోపణ.. సవాల్ విసిరిన సంకినేని..!

సూర్యాపేట, మనసాక్షి :

మంత్రి జగదీష్ రెడ్డి భాగస్వామ్యంతోనే తన అనుచరుడు డిసిఎంఎస్ ఛైర్మన్ వట్టే జానయ్య యాదవ్ మూసి కాలువ రోడ్డు భూమిని కబ్జా చేశాడని ఆధారాలతో సహా నిరూపిస్తానని మంత్రి నిజాయితీపరుడైతే మీడియా సమక్షంలో చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు.

 

జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు చేసే కబ్జాలలో మంత్రి జగదీశ్ రెడ్డి కి మెజారిటీ వాటా ఉందని ఆరోపించారు. అందుకే ఎలాంటి భయం లేకుండా బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను, చెరువులను , గుట్టలను ఆఖరికి రోడ్లను కూడా వదిలిపెట్టడం లేదని దుయ్యబట్టారు.

 

కానీ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం నిజాయితీ పరుడు అయినట్టు అభివృద్ధి ముసుగు వేసుకొని అవినీతికి పాల్పడుతూ నా దృష్టికి ఏమీ రాలేదన్నట్టు నటిస్తున్నారని అన్నారు. పిల్లలమర్రి రెవిన్యూ పరిధిలోని వజ్ర టౌన్ షిప్ పక్కన మంత్రి అనుచరుడు వట్టే జానయ్య యాదవ్ కోట్ల రూపాయల విలువైన మూసి కాలువ రోడ్డు భూమిని ఆక్రమించి నిర్మాణం చేస్తుంటే బిజెపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే వట్టే జానయ్య మాత్రం రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.

 

అసలు మంత్రినే తన అనుచరులను అడ్డం పెట్టుకుని యదేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి మెజారిటీ వాటాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. వజ్ర టౌన్ షిప్ కొరకు జిపిఏ హోల్డర్ అయినటువంటి అన్నవజ్జుల సూర్యప్రకాష్, పెద్ది నరసింహారెడ్డి ల నుండి భూమి కొనుగోలు చేసినప్పుడు ఉత్తరం దిక్కు 100 ఫీట్ల మూసి కాలువ రోడ్డుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంది వాస్తవం కాదా,ఏ కాగితాలు ఏ అనుమతులు ఉన్నాయని మంత్రి అనుచరుడు అక్కడ నిర్మాణం చేస్తున్నాడు.

 

ప్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, డిటిపిసి లేఔట్ పర్మిషన్, నాలా కన్వెన్షన్, మూసి అధికారుల నుండి హద్దుల పర్మిషన్ వీటిలో ఏ ఒకటైన ఈ నిర్మాణానికి ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఏ పర్మిషన్ లేదు ఉన్నది ఒక్కటే అధికార బలం మంత్రి జగదీశ్ రెడ్డి అండ ఇందులో మెజారిటీ వాటా మంత్రి జగదీశ్ రెడ్డిదని,?చట్టానికి వ్యతిరేకంగా అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతు , అధికారులు చట్టాలను మంత్రి అనుచరులకు చుట్టాలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

 

ఫోర్ మెన్ కమిటీ అంటూ రెవిన్యూ అధికారులు లేకుండా కమిటీ వేసి దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు రిపోర్ట్ ఇచ్చారు. ఆఖరికి మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో బెల్లం ను కూడా వదిలిపెట్టకుండా బెల్లం సిండికేట్ కు పాల్పడుతున్నారని,  రోజుకు రెండు లక్షల చోప్పనా , నెలకు 60 లక్షల రూపాయల బెల్లం సిండికేట్ జరుగుతుందని.ఇందులో మెజారిటీ వాటా మంత్రి జగదీశ్ రెడ్డిదే అని అన్నారు.

 

ఒక్కసారి సూర్యపేట నియోజకవర్గ ప్రజలు పక్కనున్న నకిరేకల్ , కోదాడలో, మిర్యాలగూడలో, తుంగతుర్తి లో బెల్లం రేట్లు ఎలా ఉన్నాయి. సూర్యాపేటలో ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. సూర్యాపేట లో భూ కబ్జాలపై మీడియా సమక్షంలో చర్చకు సిద్ధం అని ఆధారాలతో సహా నిరూపిస్తానని. మంత్రి జగదీశ్ రెడ్డి కి దమ్ముంటే చర్చకు రావాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అబీద్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్ , పార్లమెంట్ కో కన్వీనర్ తుక్కని మన్మధ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి ,జిల్లా అధికార ప్రతినిధి పలస మల్సూర్ గౌడ్ , దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్దాసు ఉపేందర్, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్,

 

జిల్లా నాయకులు పోలగాని ధనుంజయ్ గౌడ్ , పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరూరి శివ, ఐటీ సెల్ పార్లమెంట్ కో కన్వీనర్ కొప్పుల క్రాంతి రెడ్డి , మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ సలీం పాషా , దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు చెరుకుపల్లి సంజీవ, ఓబీసీ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి బూర లక్ష్మణ్ , జిల్లా నాయకులు జోగం శ్రీనివాస్ ,దాసరి వెంకన్న యాదవ్ , రాగం విజయ్ యాదవ్, యార్లగడ్డ రామారావు, పంతంగి సాలయ్య , బైరు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు