మిర్యాలగూడ : మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మ దగ్ధం

మిర్యాలగూడ : మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మ దగ్ధం

మిర్యాలగూడ టౌన్,  మన సాక్షి:

మిర్యాలగూడలో 15వ రోజు అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పట్ల పట్టణంలో భారీ ర్యాలీ తీసి బస్టాండ్ దగ్గర సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, సిఐటియుసి రామ్మూర్తి, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్ లు మాట్లాడుతూ…..

గత 15 రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు ఆయాలు వారి సమస్యల పట్ల ప్రతిరోజు వివిధ రూపాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్న కూడా ఏమాత్రం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరా ఆలోచన చేసి అంగన్వాడి జేఏసీనీ పిలిచి చర్చించి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయరని వారన్నారు.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.పెరుగుతున్న ధరల అనుగుణంగా టీచర్లకు 26వేల రూపాయలు,ఆయాలకు 20వేల రూపాయలు ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన తర్వాత టీచర్లకు పది లక్షల రూపాయలు ఆయాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిపారు.

ఈ సమస్యల మీద గత 15 రోజుల నుంచి చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా కాలయాపన చేస్తూ అంగన్వాడి టీచర్ల ఆయాలతోని ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి జిల్లా డి.లింగ నాయక్, నాయకులు వరపట్ల వెంకన్న, బైరెడ్డి వాణి,సూచిత, వజ్రమ్మ, భవాని పార్వతీ, మల్లేశ్వరి, రాణి , భాగ్యమ్మ, ప్రమీల,సైదావి బేగం, లక్ష్మమ్మ సుజాత, సునీత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :