తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Uthamkumar Reddy : రైతులతో కలిసి ట్రాక్టర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..! 

Uthamkumar Reddy : రైతులతో కలిసి ట్రాక్టర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..! 

మఠంపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన పంటపొలాలను, తెగిపోయిన చెరువు కట్టలను రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులతో కలిసి ట్రాక్టర్ పై వెళ్లి పరిశలించారు.

మఠంపల్లి మామిడ్ల చెరువు పరిశీలనకు ఐదు కిలోమీటర్లు ట్రాక్టర్ పై వెళ్ళి రైతన్నలకి ధైర్యానిచ్చారు. మండలంలోని మఠంపల్లి, చౌటపల్లి, రఘునాథపాలెం, గుండ్లపల్లి, వర్దాపురం, చెన్నాయిపాలెంలో
పర్యటించి,వరదల వల్ల నిరాశ్రయులైన నిరుపేదలకి దాతృత్వం చూపుతూ పక్షం రోజులకి సరిపడే నిత్యావసర సరుకులైన బియ్యం,పప్పు, ఆయిల్, కారం మొదలగువాటిని మఠంపల్లి మండల కేంద్రంలోని ఎస్సి కాలనిలో అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మఠంపల్లిలోని బైపాస్ రోడ్డులో చెరువు కట్ట తెగి నీరు ఇండ్లలోకి రావటం జరిగిందని, వారందరికీ పదివేల రూపాయలు సహాయం అందజేస్తామని, అలాగే రైలు కట్టకు ఖానాలు ఉండి ఉంటే ఇలా జరగకపోయేది అని ఒక్కసారి రైల్వే లైన్ కి ఖానాలు గురించి పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు.

చౌటపల్లి – మేళ్లచెర్వు రోడ్డులో తెగిన చౌటపల్లి చెరువు కట్టని,మునిగిన పంట పొలాలను పరిశీలించి త్వరగా కట్టని నిర్మిస్తామని, నష్ట పోయిన ప్రతి ఎకరానికి పది వేలు ఇస్తామని రైతులకు భరోసానిచ్చారు. తదుపరి రఘునాథపాలెం గ్రామంలో బోటి మీదకు వెళ్లే బూరవాగు వద్ద పర్యటించి ఇండ్లలోకి నీరు వెళ్లిన వారికి పది వేలు, పశువులు మరణిస్తే యాభై వేలు, మేకలు గొర్రెలు మరణిస్తే ఐదు వేలు, ఇల్లులు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయటం జరిగుతుందని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.

వర్షాల వల్ల దెబ్బతిన్న కాలువలు, రోడ్లు, చెరువులు కి వెంటనే సహాయక చర్యలు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అనంతరం గుండ్లపల్లి లిప్ట్ ఇరిగేషన్ పథకంను సందర్శించి పులిచింతల ముంపు ప్రాంతమైన గుండ్లపల్లికి ఎంత వరద వచ్చిన మునగకుండా ఎత్తులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని, రఘునాథపాలెం నుండి డబుల్ రోడ్డు వేశామని మంత్రి అన్నారు.

గుండ్లపల్లి ఎత్తిపోతల పథకం నుండి ఎక్కువ మొత్తంలో నీరు ఎత్తిపోయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు డ్యామ్ ల పూడిక, భద్రత పై కేంద్ర ప్రభుత్వం నేషనల్ సేద్మెంటేషన్ మేనేజ్ మెంట్ పాలిసీని రూపొందించి పలు రాష్ట్రాలకు సూచనలు చేసిందని మన రాష్ట్రంలో కూడా అమలు చేయుటకు డ్యామ్ ల పూడికపై యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి సబ్ క్యాబినెట్ ఏర్పాటు చేయటం జరిగిందని, పది రోజులలో నివేదిక అందజేస్తామని,తదుపరి క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించి డ్యామ్ లలో ఉన్న పూడికలను తీసివేసి పూర్తి స్థాయి లో నీరు నిల్వ చేసుకోవచ్చు అని మంత్రి అన్నారు.

మఠంపల్లి -జానపాడ్ రోడ్డులో వర్దాపురం వద్ద పంట కాలువ వరద వల్ల తెగిన రోడ్డుని పరిశీలించి ఇసుక మేటలను తొలగించి పంట నష్ట పరిహారం అందిస్తామని మంత్రి అన్నారు. అనంతరం చెన్నాయి పాలెం -అలింగాపురం రోడ్డు లో చెన్నాయి పాలెం బ్రిడ్జి వద్ద తెగిన రోడ్డుని పరిశీలించారు. మునిగిన ప్రతి ఎకరానికి పది వేలు సహాయం అందిస్తామని రైతులు ధైర్యంగా ఉండాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ శ్రీనివాసులు, ఎంపిడిఓ హరి సింగ్, తహసీల్దార్ మంగ,ఇరిగేషన్ అధికారులు, ఆర్ & బి అదికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ రెడ్డి, బ్రహ్మరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్, వైఎస్ చైర్మన్ రామచంద్రయ్య, బాబు, మాలోతు సక్రు నాయక్, బాబు, సైదులు, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మిర్యాలగూడ : మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ ఓకే చోట.. సౌకర్యాలు లేక విద్యార్థినిల అవస్థలు, ధర్నా..!

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నీట మునిగిన పంట పొలాలు..!

మరిన్ని వార్తలు