Nalgonda : నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన మంత్రులు..!
Nalgonda : నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన మంత్రులు..!
మాడుగులపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని 60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనమును శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రవాణా ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు.
అనంతరం 14.7 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మండలం గ్రామాన్ని అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇ ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని అన్నారు. నలగొండ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచే విధంగా కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాటి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మార్వో సురేష్ కుమార్ ఎంపీడీవో తిరుమల స్వామి, పిఆర్ ఏఈ మధు, ఏపిఎం చంద్రశేఖర్, తాజా మాజీ జెడ్పిటిసి పుల్లెంల సైదులు,
యువ నాయకులు గడ్డం పురుషోత్తం రెడ్డి, కళ్ళు శ్రీనివాస్ రెడ్డి, మునుగోటి యాదగిరి, వెంకన్న నరేష్, శ్రవణ్ కుమార్, భూపతి ఉశయ్య, వేముల సందీప్, సింగం కార్తీక్, పగిడిపల్లి శ్రావణ్ కుమార్, తదితర ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
MOST READ :









