Miryalaguda : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఏర్పాట్లు.. జిల్లా కలెక్టర్ స్థల పరిశీలన..!
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.

Miryalaguda : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఏర్పాట్లు.. జిల్లా కలెక్టర్ స్థల పరిశీలన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ పాఠశాలల్లో 2,500 మంది విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
మిర్యాలగూడ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికై మంగళవారం ఆయన మిర్యాలగూడ మండలం, జప్తి వీరప్పగూడెం గ్రామంలోని సర్వే నంబర్ 214లో సుమారు 20 నుంచి 25 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి అనువుగా ఉన్న స్థల వివరాలు, సంబంధించిన లే అవుట్లు, భూ రికార్డుల వివరాలన్నింటినీ సమర్పించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
స్థలానికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కాగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2500 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా తరగతి గదులు, డార్మెటరీలు, కిచెన్, డైనింగ్, ల్యాబ్లు, లైబ్రరీ, ఆట స్థలాలు, ఇలా అన్ని సౌకర్యాలను కల్పించి కార్పొరేట్ తరహాలో వీటిని తీర్చిదిద్దనున్నారు.
మైనింగ్ ఏడి రవికుమార్ ,ఆర్ ఐ రామకృష్ణ , ఆర్ ఐ కృష్ణయ్య, డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్ రెడ్డి, సర్వేయర్లు శ్రీనివాస్, సైదులు, నరసింహ , కలెక్టర్ వెంట ఉన్నారు.










