మిర్యాలగూడ : బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు..!

మిర్యాలగూడ పట్టణంతో పాటు, పలు గ్రామాల నుంచి బిఆర్ఎస్ లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం వివిధ రాజీకియ పార్టీలు కాంగ్రెస్, సీపిఎం, బీజేపీ లకు చెందిన 450 మంది బీఆర్ఎస్ లోకి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో చేరారు.

మిర్యాలగూడ : బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు..!

ఎమ్మెల్యే భాస్కర్ సమక్షంలో పార్టీలో చేరికలు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంతో పాటు, పలు గ్రామాల నుంచి బిఆర్ఎస్ లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం వివిధ రాజీకియ పార్టీలు కాంగ్రెస్, సీపిఎం, బీజేపీ లకు చెందిన 450 మంది బీఆర్ఎస్ లోకి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో సమన్వయంతో బిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించి, సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

కేసిఆర్ ప్రభుత్యం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఅర్ఎస్ లో స్వచ్ఛందంగా చేరుతుండటం పట్ల సంతోషంగా ఉందన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి,తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!