మిర్యాలగూడ : నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల నియామకం..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల బ్లాక్ కమిటీలను నూతనంగా నియమిస్తూ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు . ఆ ఉత్తర్వుల ప్రతులను కమిటీల అధ్యక్షులకు అందజేశారు. గతంలో ఉన్న కమిటీలు రద్దయాయని, నూతన కమిటీలను నియమిస్తున్నట్లు శంకర్ నాయక్ పేర్కొన్నారు.

మిర్యాలగూడ : నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల నియామకం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల బ్లాక్ కమిటీలను నూతనంగా నియమిస్తూ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు . ఆ ఉత్తర్వుల ప్రతులను కమిటీల అధ్యక్షులకు అందజేశారు. గతంలో ఉన్న కమిటీలు రద్దయాయని, నూతన కమిటీలను నియమిస్తున్నట్లు శంకర్ నాయక్ పేర్కొన్నారు.

నూతన కమిటీలు :

మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులుగా గాయం ఉపేందర్ రెడ్డి , మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా తలకొప్పుల సైదులు, దామచర్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పొదిల శ్రీనివాస్, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాకునూరి బసవయ్య,

వేములపల్లి మండల అధ్యక్షులుగా మాలికాంత రెడ్డి , మాడుగుల పల్లి మండల అధ్యక్షులుగా గడ్డం వేణుగోపాల్ రెడ్డి , దామచర్ల మండల అధ్యక్షులుగా గాజుల శ్రీనివాస్ , అడవిదేవులపల్లి మండల అధ్యక్షులుగా రమావత్ బాలు నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ : హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!

అదేవిధంగా మండలాల, పట్టణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులను కూడా నియమించారు. మిర్యాలగూడ మండలం వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా కంచు గట్ల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ పట్టణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా పొదిల వెంకన్న యాదవ్, మాడుగులపల్లి మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా పుల్లెంల నరసింహ,

అడవిదేవులపల్లి వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా గుండా శ్రీనివాస్, వేములపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా తమ్మడబోయిన రామయ్య లతో పాటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా బట్టు మాధవరెడ్డిని నియమిస్తూ శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!