TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : రుణమాఫీ పై సిపిఎం పోరు బాట.. కలెక్టరేట్ ఎదుట నిరసనకు పిలుపు..!

Miryalaguda : రుణమాఫీ పై సిపిఎం పోరు బాట.. కలెక్టరేట్ ఎదుట నిరసనకు పిలుపు..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

రుణమాఫీ పై సిపిఎం పోరుబాట చేయాలని నిర్ణయించింది. రుణమాఫీ కానీ రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలను రూపొందించింది.

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈనెల 29న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో 42 వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, కానీ కేవలం 17 వేల కోట్లు మాత్రం మాఫీ చేశారని తెలిపారు 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు.

ముఖ్యంగా ఎన్పిఏ రైతులకు రుణమాఫీ కాలేదని వారందరికీ రుణమాఫీ చేయాలని కోరారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించాలన్నారు.

సీజన్ ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పెట్టుబడి సహాయం అందించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు భరోసా అమలకు క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను కూడా సేకరించారని తక్షణమే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని అన్నారు.

ఈ నెల 29న జరిగే కలెక్టరేట్ ముందు ధర్నాకు జిల్లాలోని రుణమాఫీ కానీ రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పని చేయాలని కోరారు. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో నిండుగా నీళ్ళు ఉండడం వల్ల సాగుకు నీటి విడుదల చేయడంతో పాటు చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.

కాల్వ చివరి భూములకు నిరందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి,వినోద్ నాయక్, నాయకులు పాపా నాయక్, దయానంద్, ఎల్లయ్య, రామారావు, చాంద్ పాషా, బాషా తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మరిన్ని వార్తలు