Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే కీలక సూచన అన్నదాతలకు అండగా ఉండండి..!
రైతుల ధాన్యం నాణ్యతకు తగ్గట్టుగా మద్దతు ధర ఇవ్వాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మద్దతు ధర ఇవ్వని రైస్ మిల్లుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే కీలక సూచన అన్నదాతలకు అండగా ఉండండి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
రైతుల ధాన్యం నాణ్యతకు తగ్గట్టుగా మద్దతు ధర ఇవ్వాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మద్దతు ధర ఇవ్వని రైస్ మిల్లుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ తో నిర్వహించిన అత్యవసర సెల్ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పాల్గొని మాట్లాడారు. రైస్ మిల్లర్లు అన్నదాతలకు అండగా నిలవాలని ధాన్యం ధర విషయంలో రైతులకు రైస్ మిల్లర్లు వారు సహకరించాలని సూచించారు.
మిర్యాలగూడ నియోజకవర్గానికి రైస్ మిల్లర్స్ మరియు రైతులు ఇద్దరు రెండు కన్నులాంటి వారు కావున రైస్ మిల్లర్స్,రైతులను ఇద్దరినీ సమన్వయంతో కాపాడుకోవాల్సిన బాధ్యత తమ పై ఉందన్నారు. పారిశ్రామికంగా మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటామని ఇలాంటి సమయంలో మీరు రైతులకు అండగా ఉండి, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.









