మిర్యాలగూడ : వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పర్యటన..!
మిర్యాలగూడ : వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పర్యటన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరద ప్రాంతాలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం పర్యటించారు. మిర్యాలగూడ పట్టణంలోని సుందర్ నగర్, తాళ్లగడ్డ, షాద్ నగర్, బంగారుగడ్డ తదితర ప్రాంతాలలో పర్యటించారు రోడ్లన్నీ జలమయం కావడంతో వర్షపు నీటిలోనే నడుస్తూ కాలనీవాసులను పరామర్శించారు.
రోడ్లపై నీరు నిలవడంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయన వర్షపునీటిలోనే పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆర్డీవో కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
72 గంటల పాటు అధికారులు సెలవులు పెట్టకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల వారు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో మ్యాన్ హోల్స్, కరెంటు తీగలు తెగిపడి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్ డి ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు పొంగిపొర్ల చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్త చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డిఓ శ్రీనివాసరావు, తహసిల్దార్ హరిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. గంటల వ్యవధిలోనే అంత వర్షం..!
BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!
Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!
Nalgonda : వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవి చేయొద్దు.. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి..!











