Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

 Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీని స్వచ్చ పట్టణంగా తీర్చిదిద్దాలి.. సిబ్బందితో ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్..! 

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీని స్వచ్చ పట్టణంగా తీర్చిదిద్దాలి.. సిబ్బందితో ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్..! 

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో పాల్గొని మాట్లాడారు.

మున్సిపాలిటీలో గతంలో జరిగిన తప్పిదాలను మరల పునరావృతం కాకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.మున్సిపల్ సిబ్బంది అందరూ నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం ఉద్యోగం అనేది ఒక గొప్ప సామాజిక బాధ్యత అన్నారు.

అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి సిబ్బంది విభాగాల వారీగా తమ సమస్యలను తెలియజేయాలన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

అనంతరం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ… ఇప్పటివరకు మున్సిపల్ సిబ్బంది తెలియజేసిన ప్రతి ఒక్క సమస్యను పరిగణలోకి తీసుకున్నామన్నారు. అతి త్వరలోనే మున్సిపల్ కమిషనర్ తో కలిసి సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమహ్మద్ యూసఫ్, తహసిల్దార్ హరిబాబు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు