Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda: ప్రమాదం కాదు పక్కా ప్లాన్.. గ్యాస్ పేలి ముగ్గురు సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కలాల్ వాడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైన ఘటనలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. అందరూ ప్రమాదంగా భావించినప్పటికీ ఇది పథకం ప్రకారమే జరిగిందని సమాచారం

Miryalaguda: ప్రమాదం కాదు పక్కా ప్లాన్.. గ్యాస్ పేలి ముగ్గురు సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కలాల్ వాడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైన ఘటనలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. అందరూ ప్రమాదంగా భావించినప్పటికీ ఇది పథకం ప్రకారమే జరిగిందని సమాచారం. ఈనెల 5వ తేదీన మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి అమ్మమ్మ చంద్రకళ మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి మృతి చెందిన విషయం తెలిసిందే.

కానీ ఘటనా స్థలంలో పోలీసుల క్లూస్ టీం కు లభించిన ఆధారాల ప్రకారం లోతైన విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి ధనమ్మ రెండో భర్త శిరీష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

చిన్నతనంలోనే ధనమ్మ కు వివాహం కావడంతో ఇద్దరు పిల్లలు, తాగుడుకు బానిసైన భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా ఆమె శిరీష్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఇటీవల అతడితో కలాల్ వాడలో ఇంటి నిర్మాణం సమయంలో వివాదం తలెత్తడంతో అతడిని ధనమ్మ పక్కకు పెట్టింది.

అతడు వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ అయిన శిరీష్ కుమార్ ఆ తర్వాత నరసరావుపేటలో మరో వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా వివాదమై ఇటీవల జైలు కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. కాక ధనము పై కక్ష పెంచుకున్న శిరీష్ కుమార్ పక్క ప్లాన్ ప్రకారం.. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు. గాఢ నిద్రలో ఉన్న చంద్రకళ పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై అర్థరాత్రి పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరా రైనట్లు తెలుస్తుంది.

నిందితుడు శిరీష్ కుమార్ కు కూడా ఆ సమయంలో పెట్రోల్ అంటుకొని స్వల్ప గాయాలు కూడా అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు శిరీష్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు పోలీసులు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు