Miryalaguda : రెడ్డి కాలనీలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం.. కౌన్సిలర్ శ్రీలేఖ శేఖర్ రెడ్డి ప్రత్యేక కృషి..!
మున్సిపల్ ఎన్నికల్లో చేసిన వాగ్దానంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ లో 20, 21 వ వార్డులలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించారు. మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి ప్రత్యేక కృషి చేశారు.

Miryalaguda : రెడ్డి కాలనీలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం.. కౌన్సిలర్ శ్రీలేఖ శేఖర్ రెడ్డి ప్రత్యేక కృషి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల్లో చేసిన వాగ్దానంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ లో 20, 21 వ వార్డులలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించారు. మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ దృష్టికి కోతుల సమస్యను తీసుకువెళ్లి మేము మున్సిపల్ ఎన్నికల తర్వాత కోతుల బెడద లేకుండా చేయిస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చాము.
సోమవారం మంకీ క్యాచర్స్ బృందాన్ని పిలిపించి స్థానిక 20, 21వ వార్డులలో దాదాపుగా 100 కోతులను పట్టించడం జరిగిందని, ఈ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉందని మునిసిపల్ ఎన్నికలకు ముందు కూడా కోతులను పట్టించడం జరిగిందని వారు తెలిపారు. కోతుల బారిన పడి స్థానిక 20, 21వ వార్డులలో ఎంతో మంది ప్రమాదాల గురి అయ్యారని, ప్రతిరోజు రెడ్డి కాలనీకి దాదాపుగా (30,000) 30 వేల మంది ప్రజలు వ్యాపార నిమిత్తం హాస్పిటల్స్ కు స్కూల్స్ కు వివిధ పనుల మీద వచ్చిపోతూ ఉంటారని వీరందరూ కూడా ఈ కోతుల వలన ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండేవారని తెలిపారు.
గత జనవరి నెలలో దాదాపుగా 300 కోతులని పట్టేయడం జరిగిందని, ఇప్పుడు 100 కోతులను పట్టేయడం జరిగిందని ఇంకా కోతులు ఉన్నాయి వాటిని కూడా పట్టుకోవడానికి కోతులను పట్టే సిబ్బంది ఉందని మిగిలిన కోతులను కూడా పట్టేదాకా వారు ఇక్కడే ఉంటారని తెలిపారు.
కోతుల సమస్యని ఎమ్మెల్యే, చైర్మన్ వైస్ చైర్మన్ ల దృష్టికి తీసుకు వెళ్ళగానే తక్షణమే స్పందించి కోతులను పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందున రెడ్డి కాలనీ ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని, రెడ్డి కాలనీ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ప్రతిసారి స్పందించే వారని, రామాలయంలో వర్షాకాలంలో భక్తులు ఇబ్బంది పడకుండా సీసీ వేయించడం, రామాలయం అయ్యగారి ఇంటి పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ ఫార్మర్ మార్పించడం, లైటింగ్ ఇబ్బంది లేకుండా గుడిలో ఐమాక్స్ లైట్లు ఫిట్ చేయించడం, ధనుర్మాసంలో భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే రామాలయం చుట్టూ పెద్దలైట్లను ఏర్పాటు చేఇంచారని అన్నారు.
20వ వార్డు ప్రజలు దేనికి ఇబ్బంది పడకూడదనే సద్దేశంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించడం జరిగిందని, సమస్యలను తీర్చడంలో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ వెలుగు ఇందిరా నాగరాజు, మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, బిజెపి నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.









