Miryalaguda : రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేదలకు న్యాయం..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వలన పేద రెడ్డి కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి అన్నారు.

Miryalaguda : రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేదలకు న్యాయం..!

రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వలన పేద రెడ్డి కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి అన్నారు.

శనివారం పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో 2017 లోనే హైదరాబాదులో నిర్వహించిన సమరభేరిలో సభలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

నిరుపేదా రెడ్డిలకు రెడ్డి కార్పొరేషన్ వలన న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఇవ్వడాన్ని మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం హర్షిస్తుందని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పాప చెన్నారెడ్డి గార్లపాటి శ్రీరామ్ రెడ్డి, నామిరెడ్డి రమేష్ రెడ్డి , నర సింహారెడ్డి,ఇంద్రసేనారెడ్డి , నరేందర్ రెడ్డి, ఎర్ర మాద వెంకట్రెడ్డి, విజయేందర్ రెడ్డి , ఎస్ వెంకట్ రెడ్డి, ఎరసాని నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!